ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల పోలీస్ స్టేషన్‌లో నూతన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా యస్. వెంకట రమణయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దోర్నాల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని తెలిపారు.నల్లమల అటవీ ప్రాంతానికి అతి సమీపంలో దోర్నాల ఉండటంతో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా, ట్రాఫిక్‌కు ఎటువంటి విఘాతం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, న్యాయసమ్మతమైన పోలీస్ సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే, ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.
Admin
ANDHRA TIMES NEWS