ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్‌లో బుధవారం దర్శి డి.ఎస్.పి బి. లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ కార్యక్రమం జరిగింది. ఈ తనిఖీలో పొదిలి సి.ఐ యం.రాజేష్ కుమార్, తర్లుపాడు ఎస్.ఐ బి. బ్రాహ్మనాయుడు పాల్గొన్నారు. ఈ సామాజిక తనిఖీలో భాగంగా డి.ఎస్.పి లక్ష్మి నారాయణ పోలీస్ స్టేషన్ రికార్డులను, కేసుల పురోగతిని, ఉద్యోగుల పనితీరును సమగ్రంగా పరిశీలించారు. అనంతరం, పోలీస్ వ్యవస్థపై ప్రజలకు మరింత విశ్వాసం కల్పించేందుకు, అలాగే నేరాల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం ఎంత అవసరమో ఆయన వివరించారు. ఈ తనిఖీ కార్యక్రమం పోలీస్ స్టేషన్ నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని, పెంచేందుకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
Admin
ANDHRA TIMES NEWS