ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిణి శ్రీమతి సువర్ణ ఆదేశాల మేరకు జిల్లా బాలల సంరక్షణ విభాగం, బాల్య వివాహ నిర్మూలనకు వందరోజుల జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా సంతనూతలపాడు మండలం, ఎనికెపాడు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు బాలబాలికలకు చిన్న వయసులో వివాహం చేసుకోవడం వలన సమస్యలు ఉంటాయి అని వివరిస్తూ వివాహ నిషేధ చట్టం ప్రకారంగా వివాహం జరిగించిన లేదా వివాహంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శిక్ష విధించడం జరుగుతుంది. దీనితో పాటుగా లక్ష రూపాయలు జరిమానా కూడా విధించడం జరుగుతుంది అని న్యాయ మరియు పరివీక్షణ అధికారి శ్రీ బి రత్న ప్రసాద్ తెలియజేశారు. బాల బాలికలకు సంబంధించిన రక్షణ సంరక్షణ అవకాశాలను అదేవిధంగా ఫోక్సో చట్టం కింద పిల్లలపై జరిగే అత్యాచారాలు వాటి వలన పర్యవసానం, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 ఉపయోగాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాడ్స్ ప్రతినిధులు శ్రీమతి ఎం బాలకాసమ్మ పాల్గొన్నారు. ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు భారతదేశం బాల్య వివాహ రహిత భారతదేశంగా ఉండాలని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.
Admin
ANDHRA TIMES NEWS